ఖలీల్‌వాడి: నగరంలోనిదుబ్బ ఏరియాకు చెందిన తిరుమల వేణు(35)ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై హరిబాబు శుక్రవారం తెలిపారు. వివరాలు ఇలా.. వేణుకు పదేళ్ల కిందట వివాహం కాగా, ఏడాది క్రితం విడాకులు అయ్యాయి. కొన్ని నెలలక్రితం అతడికి నవనీత అనే యువతితో రెండవ పెళ్లి జరిగింది. కానీ అతడు నిత్యం మద్యం తాగి వచ్చి భార్యను ఇబ్బందులకు గురిచేయడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో వేణు మనస్థాపం చెంది, తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈమేరకు మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పలువురిపై కేసు నమోదు
వర్ని: మండలంలోని కూనిపూర్ శివారులోగల ఫారెస్ట్ భూమిలో ఇటీవల అక్రమంగా చొరబడి భూమి కబ్జాతోపాటు బోర్ వేసిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు వర్ని అటవీరేంజ్ అధికారి గంగాధర్ శుక్రవారం తెలిపారు. జలాల్పూర్ గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ఐదు రోజుల క్రితం రాత్రి సమయంలో భూమి కబ్జా చేయడంతో పాటు బోర్ వేశారన్నారు. ఈమేరకు స్థానికులు సంబంధిత అధికారులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు ఘటన స్థలానికి వెళ్లి విచారణ జరిపి, సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment