నేడు అలీసాగర్ నీటి విడుదల
నవీపేట: మండలంలోని కోస్లీ శివారులోని గోదావరి నది ఒడ్డుపై గల అలీసాగర్ ఎత్తిపోతల పథకం నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి శనివారం సాగునీటిని విడుదల చేస్తారని ఏఈ ప్రణయ్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రబీ పంటల సాగుకు ఈ నీటిని విడుదల చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నవీపేట, రెంజల్, ఎడపల్లి, నిజామాబాద్, డిచ్‌పల్లి, మాక్లూర్ మండలాల పరిధిలోని 53,793 ఎకరాలకు సాగు నీటిని అందించేందుకు నీటిని విడుదల చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
రేపు ఉమ్మడి జిల్లా విలువిద్య పోటీలు
నిజామాబాద్‌నాగారం: నిజామాబాద్ జిల్లా అర్చరీ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 22 ఉమ్మడి జిల్లా(నిజామాబాద్, కామారెడ్డి)లకు సంబంధించి సబ్ జూనియర్ విభాగంలో విలువిద్య(అర్చరీ) పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని రాజారం స్టేడియంలో ఆదివారం ఉదయం 8గంటలకు బాలబాలికలకు ఎంపికల పోటీలు నిర్వహిస్తామన్నారు. మరిన్ని వివరాలకు 9848919480ను సంప్రదించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment