జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక
కామారెడ్డి అర్బన్: జిల్లాకేంద్రంలోని లయోల హై స్కూల్‌లో శుక్రవారం అండర్–20 బాల బాలికల క బడ్డీ జిల్లా జట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు. ఎంపికై న బాలికల జట్టు ఆదివారం హకీంపేటలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటుందని జి ల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రంగా వెంకటేశ్వరగౌడ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి బాణాల భాస్కర్‌రెడ్డి తెలిపారు. బాలుర జట్టు ఈనెల 27న జనగామలో నిర్వహించే పోటీల్లో పాల్గొంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు మధుసూదన్‌రెడ్డి, అనిల్‌కుమార్, లక్ష్మణ్‌రాథోడ్, రాజేందర్‌రెడ్డి, రేణుక, విజయలక్ష్మి, సభాత్ రవి, సంజీవులు, నిరంజన్ పాల్గొన్నారు.
బాలికల జట్టు : కావ్య, హార్థిక, సుచరిత, కవిత, సంధ్యారాణి, ఉష, శృతి, మౌనిక, నిఖిత, లక్ష్మీప్రసన్న, కీర్తన, రిషిక, శిరీష, సునైన, జ్యోతి.
బాలుర జట్టు : వంశి, శివస్వామి, నవీన్, విఠల్, ఆంజనేయులు, ప్రహ్లాద్, అరవింద్, సంపత్, అజయ్‌కుమార్, మహేష్, రాంసింగ్, నీరజ్‌కుమార్, వెంకటేష్, గణేష్, సంపత్.
Comments
Please login to add a commentAdd a comment