పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
నిజాంసాగర్(జుక్కల్): నిజాంసాగర్‌లోని జవహార్ నవోదయ విద్యాలయంలో ఆదివారం 19 93, 94 ఆరో తరగతి బ్యాచ్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈసందర్భంగా ఆనాటి మిత్రులందరూ చాలా ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో చిన్ననాటి జ్ఞాపకాలు, ప్రస్తుత వ్యాపకాలు, ఉద్యోగం, స్థిరనివాసాలపై ఒకరినొకరు చెప్పుకుంటూ, పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆటపాటలు, నృత్యాలతో వి ద్యార్థులు ఉత్సాహంగా గడిపారు. పూర్వ విద్యార్థులు వినయ్‌కుమార్, అనిల్‌కుమార్, రేణుకా కుమారి, నాగవేందర్, విజయ్‌రాజ్, నవీన్‌కుమా ర్, రాజబాబు, విక్రమ్, నరహరి, గంగమోహన్, శోభ, రేఖ, సరిత, అనిత ఉన్నారు.
దేవునిపల్లిలో..
కామారెడ్డి అర్బన్: దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఆదివారం 2004–05 బ్యా చ్ ఎస్సెస్సీ వి ద్యార్థులు ఆత్మీ య సమ్మేళనం నిర్వహించారు. ఇరువై యేళ్ల తర్వాత కలుసుకోవడంతో ఆనాటి జ్ఞాపకాలను, మధుర స్మృతులను నెమరువేసుకున్నారు. నాటి ఉపాధ్యాయులను ముఖ్యఅతిథులుగా ఆహ్వానించి, జ్ఞాపికలను అందజేసి శాలువలతో సన్మానించారు. ఉపాధ్యాయులు సత్యం, ఉపేందర్, లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment