రాష్ట్రస్థాయి సీఎం కప్ కబడ్డీ ఇన్‌చార్జిగా ప్రశాంత్
నిజామాబాద్ నాగారం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ టోర్నమెంట్‌లో భాగంగా నిజామాబాద్ జిల్లా కబడ్డీ కోచ్, జాతీయస్థాయి క్రీడాకారుడు మీసాల ప్రశాంత్ కబడ్డీ టోర్నమెంట్‌కు ఇన్‌చార్జిగా నియమితులయ్యారు. ఈ నెల 27నుంచి 30వరకు మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్వహించే రాష్ట్ర స్థాయి సీనియర్ పురుషుల, మహిళల కబడ్డీ టోర్నమెంట్‌కు ఆయన ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహించనున్నారు. జిల్లా కోచ్‌కు ఈ అవకాశం రావడంపై జిల్లా క్రీడాకారులు, క్రీడా సంఘాల అధ్యక్ష కార్యదర్శులు ఆయనకు అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment