రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రానికి చెందిన ఇద్దరు క్రీడాకారులు కబడ్డీ విభాగంలో సీఎం కప్‌కు రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. గొల్ల నవీన్, హన్మంతోళ్ల నితిన్ ఇటీవల కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలలో పాల్గొని తమ ప్రతిభను కనబర్చారన్నారు. దీంతో న్యాయ నిర్ణేతలు వీరిద్దరిని రాష్ట్రస్థాయిలో ఆడేందుకు ఎంపిక చేశారన్నారు. ఈనెల 27, 28, 29వ తేదీలలో మహబూబ్‌నగర్ జిల్లాలో జరుగబోయే పోటీలలో పాల్గొంటారన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జట్టు నుంచి ప్రాతినిద్యం వహిస్తారన్నారు. అలాగే తాడ్వాయికి చెందిన అబ్దుల్ సమీర్, మద్ది విశాల్‌రెడ్డి, పీజీ శ్రీకర్‌యాదవ్ కూడా వాలీబాల్ విభాగంలో రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారన్నారు. వీరు ఈనెల 27నుంచి ఖమ్మంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారన్నారు.
జూనియర్ బాలికల కబడ్డీలో ..
గాంధారి(ఎల్లారెడ్డి): జూనియర్ బాలికల కబడ్డీ రాష్ట్ర స్థాయి జట్టుకు మండల పరిధిలోని పేట్‌సంగెం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినులు సుచరిత, ఉష ఎంపికై నట్లు పీఈటీ లక్ష్మణ్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 20 నుంచి జరిగిన పోటీల్లో ఈ ఇద్దరు బాలికలు మంచి ప్రతిభ కనబర్చినట్లు తెలిపారు. ఈ నెల 23 నుంచి హైదరాబాద్ జరిగే పోటీల్లో పాల్గొంటారని పీఈటీ అన్నారు.
జాతీయ స్థాయి అర్చరీ పోటీలకు ఎంపిక
దోమకొండ: జాతీయ స్థాయి అర్చరీ పోటీలకు దోమకొండ మండల కేంద్రానికి చెందిన పలువురు క్రీడాకారులు ఎంపికై నట్లు అర్చరీ కోచ్ ప్రతాప్‌దాస్ ఆదివారం తెలిపారు. నిజామాబాద్‌లో జరిగిన 12వ సబ్ జూనియర్ జిల్లాస్థాయి ట్రయల్స్ పోటీల్లో వీరు ఎంపికై నట్లు ఆయన వివరించారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 25న ఢిల్లీలోని కొల్లూరులో జరిగే పోటీలకు హాజరవుతారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment