వైద్యశాఖ మంత్రికి వినతుల వెల్లువ
మంత్రికి స్వాగతం
జిల్లా పర్యటన కోసం విచ్చేసిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు నూతన కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అలాగే టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో నాయకులు స్వాగతం పలికారు. కలెక్టర్ రాజీవ్‌గాంధీహనుమంతి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు సుమన్, జిల్లా కార్యదర్శి శేఖర్, రమణారెడ్డి, ప్రశాంత్ తదితరులు ఉన్నారు.
నిజామాబాద్ అర్బన్/నిజామాబాద్ సిటీ/నిజామాబాద్‌నాగారం: జిల్లాకేంద్రంలో ఆదివారం పర్య టించిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోద ర రాజనర్సింహకు వివిధ పార్టీలు, సంఘాల నా యకులు పలు సమస్యలపై వినతిపత్రాలు అందజే శారు. రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం అసోసియేట్ ప్రెసిడెంట్ సురేష్ , డీసీఈబీ సెక్రెటరీ సీతయ్య ఆధ్వర్యంలో సభ్యులు మంత్రికి వినతిప త్రం అందజేశారు. ప్రధానోపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. అలాగే జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిని వెయ్యి పడకల ఆస్పత్రిగా మార్చాలని సీపీఐ నాయకులు మంత్రిని కో రారు. సమగ్రశిక్ష ఉద్యోగులు తమ సమస్యలను మంత్రికి విన్నవించారు. మంత్రికి పలు సమస్యలను విన్నవించడానికి వచ్చిన ఎంఐఎం నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. చివరకు మంత్రికి విన్నవించడానికి అనుమతించారు. ఏఐటీయూసీ, వివిధ సంఘాల ప్రతినిధులు మంత్రికి పలు సమస్యల పరిష్కారానికి విన్నవించారు. డాక్టర్ కవితారెడ్డి సైతం మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్‌సీడీ క్లినిక్ ప్రారంభం
నిజామాబాద్‌నాగారం: జీజీహెచ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్‌సీడీ క్లినిక్‌ను మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. అలాగే ఎంసీహెచ్‌లోని నూతన భవనంలో క్రిటికల్ కేర్ విభాగాన్ని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణగుప్తా ప్రారంభించారు. జీజీహెచ్ ఆవరణలో కొత్తగా 108 అంబులెన్సును పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment