సోయా కొనుగోలు చేయాలని రాస్తారోకో
మద్నూర్(జుక్కల్): సోయా పంటను కొనుగోలు చేయాలని మద్నూర్ మండల కేంద్రంలో గురువారం రైతులు రాస్తారోకో నిర్వహించారు. మద్దతు ధరకు సోయా కొనుగోలు చేయడానికి స్థానిక మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ఈ నెల 7న అధికారులు మూసి వేశారు. కొనుగోళ్లు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. కానీ పంట పూర్తిగా కొనుగోలు చేయకుండానే కేంద్రం మూసి వేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా రోజులుగా కొనుగోలు కేంద్రానికి రైతులు తీసుకు చ్చిన సోయా పంట అలాగే ఉందని, మధ్యలోనే కొనుగోళ్లు నిలిపి వేయడం ఏంటని రైతులు నిలదీశారు. రైతుల ఆందోళన విషయాన్ని తహసీల్దార్ ముజీబ్ బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయికి సమాచారం అందించడంతో ఆమె వచ్చి రైతులతో మాట్లాడారు. రైతుల సమస్యలను కలెక్టర్, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆమె హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment