చైన్ స్నాచర్ల అరెస్టు
ఖలీల్‌వాడి: నగరంలోని గౌతమ్‌నగర్‌లో చైన్‌స్నాచింగ్‌కు పాల్పడిన ఇద్దరిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై హరిబాబు గురువారం తెలిపారు. వివరాలు ఇలా.. ఈనెల 4న నిందితులు చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిందితులు సాయి, కీర్తిరాజ్‌లను గుర్తించి వారిని పట్టుకున్నట్లు తెలిపారు. అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
హత్యాయత్నం కేసులో ఒకరు..
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట పోలీస్‌స్టేషన్‌లో పరిధిలో నాలుగురోజులక్రితం జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించి ఒకరిని అరెస్టు చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు. గ్రామశివారులోని శిఖంభూమిలో పంటలసాగు విషయమై ఈ నెల 13న పలువురి మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనపై వెంకంపల్లికి చెందిన చిలుకూరి సురేందర్‌రెడ్డి నాగిరెడ్డిపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు గ్రామానికి చెందిన ఆకిడి జమాకర్‌రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. రిమాండ్‌కు తరలించినట్లు నాగిరెడ్డిపేట ఎస్సై మల్లారెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment