ఇంటర్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
నిజామాబాద్ అర్బన్: నగరంలోని హరిచరన్ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ సోమవారం తనిఖీ చేశారు. ప్రిన్సిపాల్, అధ్యాపకులతో సమావేశమయ్యారు. పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. ఇంటర్ ప్రయోగ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయడంతో పాటు వార్షిక పరీక్షలకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. కళాశాలలో ప్రయోగశాలల నిర్వహణపై సమీక్షించారు.
పరీక్షా కేంద్రం తనిఖీ
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ న్యాయ కళాశాలలో సోమవారం ఎల్‌ఎల్‌బీ ఐదో సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాన్ని వీసీ యాదగిరిరావు తనిఖీ చేశారు. పరీక్షలను సక్రమంగా నిర్వహించాలని, విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఆదేశించారు. ఈ పరీక్షలకు 28 మంది విద్యార్థులకు 26 మంది హాజరైనట్లు ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment