నిజామాబాద్ రూరల్: నగరంలోని గూపన్‌పల్లి శివారులో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు రూరల్ ఎస్‌హెచ్‌వో మహ్మద్ ఆరీఫ్ తెలిపారు. గూపన్‌పల్లి శివారులో గల చెరువులో మృతదేహం గమనించిన స్థానికులు తమకు సమాచారం అందించారని చెప్పారు. హత్య చేసి పడేసినట్లు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మృతుడి వయస్సు 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉంటుందని ఆయన తెలిపారు.
డ్రంకన్ డ్రైవ్ కేసులో జైలు
బోధన్‌టౌన్: డ్రంకన్ డ్రైవ్ కేసులో ఒకరికి జడ్జి ఒక రోజు జైలు శిక్ష వేసినట్లు బోధన్ పట్టణ సీఐ వెంకట నారాయణ తెలిపారు. మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తిని సోమవారం బోధన్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ శేషతల్ప సాయి ఎదుట హా జరు పర్చగా జైలు శిక్ష విధించారన్నారు. అలాగే పట్టణంలోని బైపాస్ రోడ్డులో బహిరంగంగా మద్యం తాగిన ఐదుగురికి కమ్యునిటీ సర్వీస్ శిక్ష వేశారని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడుపొద్దన్నారు.
జేసీబీ పట్టివేత
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ మండలం అంకాపూర్‌లో అనుమ తి లేకుండా మొరం తీస్తున్న జేసీబీని ఆదివారం రాత్రి అధికారులు పట్టుకున్నారు. అనంతరం జేసీబీని ఆర్టీసీ డి పో ప్రాంగణంలో ఉంచారు. అధికారులు ఇంకా పంచానా మా చేయలేదని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment