కరీంనగర్: ముత్తారం, మంథని మండలంలోని లక్కారం గ్రామానికి చెందిన మైనింగ్ డిప్లొమా విద్యార్థి నాయిని ధర్మతేజరెడ్డి(19) అంతుచిక్కని వ్యాధితో మంగళవారం మృతిచెందాడు. గ్రామానికి చెందిన నాయిని రాజి రెడ్డి – సుజాత దంపతులకు కుమారుడు ధర్మతేజరెడ్డి, కుమార్తె ఉన్నారు. రాజిరెడ్డి సింగరేణి కార్మి కుడు.
మైనింగ్ డిప్లొమా ఫైనలియర్ చదువుతున్న ధర్మతేజరెడ్డి మార్చి 4న అకస్మాత్తుగా కాళ్లు చచ్చుబడి నడవలేనిస్థితికి చేరాడు. కడుపు, తలనొప్పి, వాంతులు, నరాల బలహీనతతో కూప్పకూలాడు. తల్లిదండ్రులు తొలుత గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షించిన డాక్టర్లు లాంగ్ సెగ్మెంట్ ట్రాన్స్వర్ మైలిటిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారని కుటుంబసభ్యులు తెలిపారు.
ఇది వెన్నుపూస భాగంలో విస్తరించి, వెన్నుముక మాగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్‌లో హై పర్‌టెన్సిటీని కలిగించే విస్తృతమైన వాపు లక్షణ మని తేల్చారు. ఇలాంటి కేసులు ఇప్పటివరకు ప్రపంచంలో 11 నమోదయ్యాయని, మనదేశంలో ఇది రెండో కేసని వైద్యులు వివరించారని మృతుడి తండ్రి తెలిపారు. ఇదే విషయంపై ముత్తారం ప్రభుత్వ వైద్యుడు అమరేందర్‌రావును ‘సాక్షి’ సంప్రదించగా.. పది లక్షల మందిలో ఈ వ్యాధి ఒకరికి వస్తుందని, బాల్యంలోనే ఏర్పడే ఈ వ్యాధి క్రమేపీ యుక్తవయస్సులో బయటపడుతుందన్నారు. విషయం తమ దృష్టికి వచ్చిందని, మెడికల్ రిపోర్టు ప రిశీలించి ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment