కులగణనలో పాల్గొని సహకరించాలి
విద్యానగర్(కరీంనగర్): రాష్ట్రంలో జరుగుతున్న సమగ్ర కులగణనలో ఎలాంటి అపొహాలకు తావు లేకుండా బీసీ కులాలంతా కులగణనలో పాల్గొని సహకరించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం కరీంనగర్ ప్రెస్‌భవన్‌లో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్యగౌడ్ అధ్యక్షతన జరిగిన కులగణన చైతన్య సదస్సులో మాట్లాడారు. బీసీ కులాల లెక్కలు జరగకుండా అనేకమంది రాష్ట్రవ్యాప్తంగా అనేక రకాలుగా కుట్రలు చేస్తున్నారని అన్నారు. కుట్రలను ఛేదించి బీసీలంతా నిరంతరం అప్రమత్తతతో కులాన్ని తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడు శ్రీనివాస్, రాష్ట్ర సహాయ ప్రధాన కార్యదర్శి సంపత్‌గౌడ్, నాయకులు జీఎస్ ఆనంద్, వరికుప్పల మధు, రాచమల్ల రాజు, దొగ్గలి శ్రీధర్, మాచర్ల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment