పోరాట యోధుల సమీకరణే సభ్యత్వ ఉద్దేశం
కరీంనగర్ అర్బన్: పోరాట యోధుల సమీకరణే సభ్యత నమోదు ప్రధాన ఉద్దేశఽమని టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా పశుసంవర్థక శాఖ, కొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సభ్యత్వమంటే డబ్బులు కాదని, పునాది రాళ్ల సేకరణ, ప్రశ్నించే పోరాట యోధుల సమీకరణ అని అన్నారు. ఉద్యోగుల సంఘటిత పోరాటాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని, అందుకు టీఎన్జీవో చక్కటి వేదికని వివరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోల జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, వేణుగోపాలరావు, రాగి శ్రీనివాస్, గూడ ప్రభాకర్‌రెడ్డి, కోశాధికారి ముప్పిడి కిరణ్‌కుమార్, పట్టణ అధ్యక్షుడు సర్దార్ హర్మిందర్ సింగ్, గిరిధర్‌రావు, జగన్‌గౌడ్, హరిప్రియ, విజయలక్ష్మి, రాజు, పోచయ్య, ఉద్యోగ సంఘ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment