ఏడేళ్లకే నూరేళ్లు
● పాల వాహనం ఢీకొని విద్యార్థిని మృతి
చిగురుమామిడి(హుస్నాబాద్): రెండో తరగతి విద్యార్థినికి ఏడేళ్లకే నూరేళ్లు నిండాయి. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. చిగురుమామిడి మండలం బొమ్మనపల్లికి చెందిన బొల్లి మహేశ్–సుమ దంపతులకు అమూల్య, మహి (7) సంతానం. మహి బొమ్మనపల్లి ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. గురువారం సాయంత్రం పాఠశాల వదలిపెట్టగా ఇంటికి వె ళ్తున్న క్రమంలో బొమ్మనపల్లి–హుస్నాబాద్ రహదారిపై పాల వ్యాన్ వేగంగా వచ్చి వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహికి తీవ్రగా యాలు కావడంతో స్థానికులు 108లో కరీంనగర్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేశ్ తెలిపారు.
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): సుల్తానాబాద్ మండలం అల్లీపూర్ గ్రామానికి మీస జగదీశ్వర్(25) విద్యుదాఘాతంతో మృతిచెందాడు. ఎస్సై శ్రావణ్‌కుమార్ తెలిపిన వివరా లు.. జగదీశ్వర్ గురువారం తమ పశువుల కొ ట్టం వద్దకు వెళ్లగా అక్కడ సర్వీస్ వైర్ కిందపడి ఉంది. దాన్ని సరిచేసే క్రమంలో పైన ఉన్న 11కేవీ వైర్లకు ప్రమాదవశాస్తు తగిలి విద్యుత్ షా క్‌కు గురయ్యాడు. స్థానికులు సుల్తానాబాద్ ప్ర భుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేర కు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఆస్పత్రి సూపరింటెండెంట్ సరెండర్
జగిత్యాల: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న రాములును కలెక్టర్ సత్యప్రసాద్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సమావేశాలకు హాజరుకాకపోవడం, మాత శిశు సంక్షేమ కేంద్రంలో ఘటనలు జరగడం, ఆస్పత్రి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment