3 కిలోల కణతి తొలగింపు
జమ్మికుంట(హుజూరాబాద్): పట్టణంలోని సురక్ష మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో ఓ మహిళ గర్భాశయంలో 3 కిలోల కణతిని ఆపరేషన్ చేసి తొలగించారు. డాక్టర్ తిరుప తి, డాక్టర్ స్వర్ణలత తె లిపిన వివరాలు.. 44 ఏళ్ల వయస్సు గల ఓ మహిళ నాలుగు నెలలుగా కడుపు నొప్పితో బాధపడుతూ సురక్ష మల్టీస్పెషాలిటీ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చింది. వైద్యులు స్కానింగ్ చేసి ఆమె గర్భాశయంలో పెద్ద కణతి ఉన్నట్లు గుర్తించారు. డాక్టర్లు స్వర్ణలత, వంశీకృష్ణ, సుమన్ వైద్య బృందం అరుదైన ఆపరేషన్ చేశారు. గర్భాశయం నుంచి 3 కిలోల కణతిని తొలగించి మహిళ ప్రాణాలు కాపాడారు.
పోలీసుల అదుపులో దొంగలు?
జగిత్యాలక్రైం: బీర్‌పూర్ మండల కేంద్రానికి చెందిన క్యాసం ఈశ్వరయ్య ఇంట్లో దంపతులపై దాడిచేసి చోరీకి పాల్పడ్డ నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈనెల 14 వేకువజామున ఈశరయ్య ఇంట్లోకి దొంగలు ప్రవేశించి అతడి కాళ్లు, చేతులు కట్టేసి భార్యపై కూడా దాడిచేశారు. అనంతరం ఇంట్లోని బంగారు నగలు, వెండి, రూ.10 వేల నగదు ఎత్తుకెళ్లారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు రూరల్ సీఐ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులు మంచిర్యాల జిల్లా వాసులుగా గుర్తించి గురువారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment