వాలీబాల్ టోర్నీకి ఎంపిక
గంభీరావుపేట(సిరిసిల్ల): కేరళ రాష్ట్రంలో త్వరలో జరిగే దక్షిణాది అంతర్రాష్ట్ర విశ్వవిద్యాలయాల వాలీబాల్ టోర్నమెంట్‌కు మండలంలోని లింగన్నపేటకు చెందిన మనోహర్ ఎంపికయ్యాడు. ఉస్మానియా యూనివర్సిటీ జట్టులో రెండేళ్లుగా ఆడుతున్న మనోహర్ యూనివర్సిటీ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈసందర్భంగా అతడిని రాజన్న సిరిసిల్ల జిల్లా వాలీబాల్ అసోసియేషన్ సభ్యులు, క్రీడాభిమానులు అభినందించారు.
బైక్ దొంగలకు జైలుశిక్ష
వేములవాడ: ద్విచక్ర వాహనాల దొంగతనం కేసులలో ఇద్దరికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ వేములవాడ ప్రథమశ్రేణి న్యాయమూర్తి జోతిర్మయి గురువారం తీర్పునిచ్చారు. టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపి న వివరాలు.. వేములవాడ పట్టణానికి చెందిన చిట్టిమల్ల అంజయ్య, జగిత్యాలకు చెందిన ఉబిది గంగస్వామిలకు సంబంధించిన ద్విచక్ర వాహనాలను చోరీ చేసిన చందుర్తి మండలం బండపల్లికి చెందిన షేక్ మహబూబ్, బొప్పాపూర్‌కు చందిన అనరసి కిష్టయ్యను రెండు కేసుల్లో జూన్‌లో రిమాండ్‌కు తరలించారు. విచారణ అధికారి అంజయ్య కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా సీఎంఎస్ ఎస్సై రవీందర్‌నాయుడు ఆధ్వర్యంలో కానిస్టేబుల్ సురేశ్ కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్ తరుఫున ఏపీపీ విక్రాంత్ కేసు వాదించగా, న్యాయమూర్తి జ్యోతిర్మయి కేసు పూర్వపరాలు పరిశీలించారు. నిందితులకు ఏడాది జైలు, రూ.2 వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.
రైస్‌మిల్లుపై కేసు
ఓదెల(పెద్దపల్లి): ఓదెల గ్రామంలోని మల్లికార్జున రా రైస్‌మిల్లుపై కేసు నమోదు చేసినట్లు సంబంధిత అధికారులు శ్రీనివాస్, మహేశ్ గురువారం తెలిపా రు. ప్రభుత్వం ఇచ్చిన వరి ధాన్యం 33,06,381 క్వింటాళ్లకు, మిల్లువారు ఇవ్వాల్సిన సీఎంఆర్ 22,152,81 క్వింటాళ్లు ఉండగా, తనిఖీల్లో 32,636.31 క్వింటాళ్లు వ్యత్యాసం రావడంతో మిల్లుపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment