మరమ్మతు చేయరు.. పూడిక తీయరు
ఇది డీ–89 ప్రధాన కాల్వ దుస్థితి. కరీంనగర్ మండలం ఎలబోతారం శివారులో కాల్వ సిమెంట్ లైనింగ్ కూలిపోగా, అడ్డుగా పడిన బండరాళ్లతో కిందకు నీళ్లు వెళ్లలేని స్థితి.
కరీంనగర్ జిల్లాలోని చాలావరకు
కాల్వలది ఇదే పరిస్థితి.
పూర్వ వైభవం
తీసుకురావాలి
ఆయకట్టు రైతుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అధికారులు డీబీఎం–17 ఉపకాలువకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి. పేరుకుపోయిన పూడిక, పిచ్చిమొక్కలను తొలగించాలి. కాలువ సరిగ్గా లేకపోతే చివరి ఆయకట్టు వరకు నీరందే పరిస్థితి లేదు. అధికారులు చొరవ తీసుకొని మరమ్మతులు చేయించి కాలువకు పూర్వవైభవం తీసుకురావాలి.
– పసుల స్వామి,
సామాజిక కార్యకర్త, హుజూరాబాద్
అత్యవసర పనులకే నిధులు మంజూరు
ఎస్సారెస్పీలో అత్యవసరమైన పనులకు మాత్రమే ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. ఇరుకుల్ల వద్ద రూ.4లక్షలతో కల్వర్టు పనులు నడుస్తున్నాయి. ఉపాధిహామీ ద్వారా కొన్ని కాలువల్లో పూడిక తొలగించాం.
– సంతోష్, డీఈ, ఎస్సారెస్పీ, కరీంనగర్‌రూరల్
కరీంనగర్‌రూరల్/హుజూరాబాద్: ఎస్సారెస్పీ కా ల్వలు అధ్వానంగా మారాయి. ఆయకట్టు కాల్వలు శిథిలావస్థకు చేరాయి. డ్రాపులు కూలిపోయి పొలా లకు నీళ్లందడం లేదు. ప్రధాన కాల్వలకు మరమ్మతు చేయకపోవడం, పూడిక తీయకపోవడంతో ఏ టా ఆయకట్టు చివరి భూములకు నీరందక పంట లు ఎండిపోతున్నాయి. ప్రస్తుతం యాసంగి సీజన్ పంటల సాగు పనులు ముమ్మరంగా సాగుతున్నా యి. ఈ నెల 25 నుంచి ఎస్సారెస్పీ నీటిని విడుదల చేస్తారనే ప్రభుత్వ ప్రకటనతో పలువురు రైతులు వ రిపంటను సాగు చేసేందుకు ముందుకొస్తున్నారు.
పేరుకుపోయిన పూడిక
కరీంనగర్‌రూరల్ డివిజన్ పరిధిలో డీ–89 నుంచి డీ–94 ప్రధాన కాల్వల ద్వారా 27వేల ఎకరాలు సాగవుతోంది. డీ–89 ప్రధాన కాల్వ శిథిలావస్థకు చేరింది. డ్రాపులు కూలిపోగా సిమెంట్ లైనింగ్ ధ్వంసమైంది. కాల్వల్లో బండరాళ్లు అడ్డుగా పడడంతో ఆయకట్టు కింది గ్రామాలు ఇరుకుల్ల, మొగ్దుంపూర్, సాంబయ్యపల్లి, గొల్లపల్లి గ్రామాల్లోని ఆయకట్టు భూములకు నీళ్లందడం లేదు. ప్రధాన కాల్వతోపాటు ఉపకాలువల్లో సైతం పిచ్చిమొక్కలతో పూడిక పేరుకుపోయింది. డీ–94 ప్రధాన కాల్వ ద్వారా గోపాల్‌పూర్, దుర్శేడ్, బొమ్మకల్, చేగుర్తి గ్రామాలకు సాగునీరు సరఫరా చేస్తారు. అయితే కార్పొరేషన్‌లో విలీనమైన రేకుర్తి, ఆరెపల్లి, తీగలగుట్టపల్లి, వల్లంపహాడ్ పరిధిలోని కాలువలో పిచ్చిమొక్కలు పెరిగి పూడిక పేరుకుపోయింది. ఆయా గ్రామాల్లో ఉపాధిహామీలో పూడికతీసే అవకాశం లేకపోవడంతో ఇటీవల మున్సిపల్ నిధులు రూ.6 లక్షలతో పూడిక తొలగించే పని చేపట్టారు.
250 ఎకరాలకు నీరందించే కాలువపై అలసత్వం..
ఎస్సీరెస్పీ కెనాల్ కింద గల డీబీఎం–17 ఉపకాలువ పరిధిలో పెద్ద పాపయ్యపల్లి, హుజూ రాబాద్, రాంపూర్, రంగాపూర్ గ్రామాల్లో సుమా టరు 250 ఎకరాలకు నీరందించే లక్ష్యంగా ఏర్పాటైంది. పెద్దపాపయ్యపల్లి నుంచి ప్రారంభమై హుజూరాబాద్ పోచమ్మగుండ్ల కింది వరకు వెళ్లి వాగులో కలుస్తుంది. ఉపకాల్వ కింద ఆయకట్టు రైతులు ఏడాదికి రెండు పంటలు పండించవచ్చు. ఆయకట్టు రైతులే లక్ష్యంగా ఉన్న ఈ కాలువపై అధికారుల పట్టింపు కరువవడంతో పూర్తిగా రూపురేఖలు కోల్పోయింది.
ఎస్సారెస్పీ కాల్వల నిర్వహణ అధ్వానం చివరి ఆయకట్టుకు నీరందక ఎండుతున్న పంటలు
Comments
Please login to add a commentAdd a comment