ఎములాడ రాజన్నకు మొక్కులు
వేములవాడ: ఎములాడ రాజన్నను శుక్రవారం దాదాపు 20 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి అభిషేకాలు, అన్నపూజలు చేసి, కోడెమొక్కులు చెల్లించుకున్నారు. సత్యనారాయణ వ్రతాలు, అమ్మవారికి కుంకుమ పూజలు జరిపారు. అనంతరం బద్దిపోచమ్మకు బోనం మొక్కులు చెల్లించి, భీమన్న, నగరేశ్వరాలయాలను సందర్శించారు. భక్తుల ఏర్పాట్లను ఆలయ అధికారులు పర్యవేక్షించారు.
స్వామివారి సేవలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు..
వేములవాడ రాజన్నను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు కొంకటి లక్ష్మీనారాయణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ప్రత్యేక దర్శన అవకాశం కల్పించారు. ప్రొటోకాల్ ఏఈవో అశోక్ శాలువాతో సత్కరించి, ప్రసాదం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment