నేరెల్ల గుట్టల్లో మృతదేహం?
ధర్మపురి: మండలంలోని నేరెల్ల గుట్టల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అడవిలో పనులకు వెళ్లిన కొందరు సదరు మృతదేహాన్ని చూసినట్లు తెలిసింది. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ విషయమై ఎస్సై ఉదయ్‌కుమార్‌ను వివరణ కోరగా అడవిలో మృతదేహం ఉన్నట్లు వదంతులు వస్తున్న మాట నిజమేనని, కానీ ఎక్కడుందో తెలియడం లేదని పేర్కొన్నారు. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
వ్యక్తి ఆత్మహత్య
హుజూరాబాద్: మండలంలోని రాంపూర్‌కు చెందిన సుంకరి రమేశ్(46) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. రమేశ్‌కు భార్య, ఇద్దరు పిల్ల లున్నారు. దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో రెండేళ్ల క్రితం పిల్ల లను తీసుకొని, భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటినుంచి రమేశ్ ఏ పనీ చేయకుండా ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో అతనికి కేన్సర్ ఉన్నట్లు తెలిసింది. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టి, భార్యను ఇంటికి రావాలని కోరినా ఆమె రాలేదు. దీంతో రమేశ్ మనస్తాపానికి గురై, శుక్రవారం ఇంట్లోనే ఉరేసుకున్నాడు. మృతుడి తల్లి కొమురమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
కుక్కల దాడిలో గొర్రెపిల్లలు మృత్యువాత
ధర్మారం(ధర్మపురి): నర్సింగపూర్ గ్రామానికి చెందిన బద్ద సుధాకర్‌రెడ్డి గొర్రెల మందపై శుక్రవారం ఉద యం కుక్కలు దాడిచేశాయి. ఈ ఘటనలో 12 గొర్రెపిల్లలు చనిపోయాయి. తన ఇంటి వెనుకాల షెడ్‌లో గొర్రెలను ఉంచగా, వీధికుక్కలు ఒక్కసారిగా దాడిచేసి చంపినట్లు బాధితుడు సుధాకర్‌రెడ్డి తెలిపారు. మధ్యా హ్నం ఇంటికి వచ్చిన తర్వత గొర్రె పిల్లలకు పాలు పెట్టేందుకు వెళ్లగా గొర్రెపిల్లలు కనిపించలేదని, సమీపంలో గాలించగా కళేబరాలు కనిపించాయని ఆవేదన వ్యక్తం చేశాడు. గొర్రె పిల్లల కోసం వేసిన ఫెన్సింగ్‌ను ధ్వంసం చేసి గొర్రె పిల్లలను ఎత్తుకుపోయి చంపినట్లు అతడు వివరించాడు.
పీఏసీఎస్ సేవలు విస్తరించాలి
సుల్తానాబాద్(పెద్దపల్లి): పీఏసీఎస్ సేవలు విస్తరించాలని నాబార్డ్ సీజీఎం ఉదయభాస్కర్ అన్నారు. శుక్రవారం సుల్తానాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. సహకార సంఘం సభ్యులకు 6 శాతం డివిడెంట్ ఇవ్వడం శుభపరిణామమని అన్నారు. వ్యాపారులకు, గృహ నిర్మాణదారులకు రుణాలు ఇవ్వడంతోపాటు లాకర్ సౌకర్యం ఏర్పాటు చేస్తే మరిన్ని లాభాలు వస్తాయని తెలిపారు. రైతులకు ఎక్కువ రుణాలు ఇచ్చే ప్రయత్నం చేయాలని సూచించారు. చైర్మన్, కేడీసీసీబీ డైరెక్టర్ శ్రీగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పీఏసీఎస్ పరిధిలో 3,499 మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. రూ.40 కోట్ల విలువైన రుణాలు ఇచ్చామని, రూ.19 కోట్ల డిపాజిట్లు ఉన్నాయన్నారు. అనంతరం నాబార్డ్ సీజీఎంను సన్మానించారు. కార్యక్రమంలో కేడీసీసీబీ సీఈవో సత్యనారాయణరావు, డీడీఎంలు జయప్రకాశ్, దిలీప్, జీఎం రియాజుద్దీన్, రిసోర్స్‌పర్సన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment