ఉచిత ఫౌండేషన్ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం
కరీంనగర్: రాష్ట్ర మైనారిటీ సంక్షేమశాఖ స్టడీ సర్కిల్ ద్వారా గ్రూప్–1,2,3,4, ఎస్‌ఎస్‌బీ, ఆర్‌ఆర్‌బీ, బ్యాకింగ్ పీవో నియామక పరీక్షల కోసం నాలుగు నెలల ఉచిత కోర్సు కోసం మైనార్టీల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి పి.పవన్‌కుమార్ తెలిపారు. ఆసక్తి ఉన్నవారు లింక్ https:// forms.gle/R7Z9 WtqJygj1At9C7 ద్వారా నాలుగు నెలల ఫౌండేషన్ కోర్సు కోసం నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. కలెక్టరేట్‌లోని జిల్లా మైనారిటీల సంక్షేమ కార్యాలయంలో తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. కోర్సులో నమోదు చేసుకోవడానికి జనవరి 17 చివరి తేదీ అని తెలిపారు. ఏవైనా సందేహాలు ఉంటే కార్యాలయ వేళల్లో 0878–2957085ను సంప్రదించవచ్చునని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
పలు పరీక్షలు వాయిదా
కరీంనగర్ సిటీ: శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని పీజీ, ఎంబీఏ, ఎంసీఏ మూడో సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. టీజీసెట్, యూజీ సెట్ ఉన్నందున పరీక్షలు వాయిదా వేశామని, తిరిగి నిర్వహించే తేదీలను త్వరలో తెలియజేస్తామని తెలిపారు.
డిగ్రీ పరీక్షల్లో ఆరు మాల్‌ప్రాక్టీస్ కేసులు
శాతవాహన యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో మంగళవారం ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి తెలిపారు. కరీంనగర్‌లోని వివిధ కళాశాలల్లో ఈ కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.
6నుంచి ఎల్‌ఎల్‌బీ సెమిస్టర్స్
శాతవాహన యూనివర్సిటీ పరిధిలో 2025 జనవరి 6వ తేదీ నుంచి ఎల్‌ఎల్‌బీ 5వ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణ అధికారి తెలిపారు. 1వ పేపర్ 6వ తేదీన, 2వ ెపేపర్ 8వ తేదీన, 3వ పేపర్ 10న, 4వ పేపర్ 17న, 5వ పేపర్ 20వ తేదీన నిర్వహిస్తామని పేర్కొన్నారు.
రెండు ఆర్టీసీ బస్సులు ఢీ
● డ్రైవర్‌కు గాయాలు.. ప్రయాణికులు క్షేమం
శంకరపట్నం: మండలంలోని తాడికల్ గ్రామంలో మంగళవారం రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఒక బస్సు డ్రైవర్‌కు గాయాలు అయ్యాయి. బోధన్ డిపోకు చెందిన బస్సు 43మంది ప్రయాణికులతో వరంగల్ నుంచి నిజామాబాద్ వెళ్తోంది. వరంగల్–1డిపోకు చెందిన డిలక్స్ బస్సు 41మంది ప్రయాణికులతో హన్మకొండ వెళ్తోంది. మార్గంమధ్యలో శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. డీలక్స్ బస్సు రోడ్డు కిందకు దూసుకెళ్లి వ్యవసాయబావి ముందు నిలిచిపోయింది. ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్‌నుంచి బయటికి వచ్చారు. బోధన్ డిపోకు చెందిన బస్సు డ్రైవర్ రాఘవేందర్‌కు గాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment