అమిత్‌షాను పదవి నుంచి తొలగించాలి
● నగరంలో కాంగ్రెస్ సమ్మాన్ మార్చ్ ర్యాలీ
కరీంనగర్ కార్పొరేషన్: అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను మంత్రి పదవి నుంచి తొలగించాలని డీసీసీ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం డిమాండ్ చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు డీసీసీ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలో సమ్మా న్ మార్చ్ ర్యాలీ నిర్వహించారు. కోర్టు చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం చేపట్టిన ర్యాలీ కోర్టు చౌరస్తా నుంచి ఇందిరాచౌక్ వరకు సాగింది. చౌక్‌లో ఉన్న ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేడ్కర్, రాజ్యాంగంపై అమర్యాదగా మాట్లాడిన అమిత్‌షాపై చర్యతీసుకోవాలన్నారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మ న్ సత్తు మల్లేశం, పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జీలు పురుమల్ల శ్రీనివాస్, వొడితెల ప్రణవ్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్‌కుమార్, కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, గడ్డం విలాస్‌రెడ్డి, ఎం. డి.తాజ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment