ప్రధానికి ఎలబోతారం డప్పు కళాకారుల స్వాగతం
సైదాపూర్: ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇంటి వద్ద మంగళవారం నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఆయనకు స్వాగ తం పలుకుతూ కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎలబోతారం గ్రామానికి చెందిన నమిండ్ల రవి డప్పు కళాకారుల బృందం కళా ప్రదర్శన ఇచ్చింది. ప్రధాని వారితో కరచాలనం చేసి, అభినందించారు.
ముగ్గురు దొంగల పట్టివేత
కోరుట్ల: పట్టణ శివారులోని కల్లూర్ రోడ్డులో రైల్వే బ్రిడ్జివద్ద ఇద్దరిని, యూసుఫ్‌నగర్‌లో ఒక దొంగను పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం పట్టణంలోని అయిలాపూర్ రోడ్డులోని వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో సోమవా రం రాత్రి చోరీ జరిగింది. దొంగలు హుండీ పగులగొట్టి నగదు దోచుకున్నారు. మంగళవారం పోలీసులు గాలిస్తుండగా రైల్వే బ్రిడ్జివద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరిని పట్టుకొని విచారించగా, బ్ర హ్మంగారి గుడిలో దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నారు. దొంగలు మహారాష్ట్రకు చెందిన వారుగా పో లీసులు తెలిపారు. యూసుఫ్‌నగర్ ఎల్లమ్మ గుడిలో దొంగ హుండీ పగులగొడుతుండగా గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ముగ్గురు దొ ంగలను బుధవారం కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించినట్టు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
యువతి ప్రాణాలు కాపాడిన పోలీసులు
సారంగాపూర్: తల్లిదండ్రులతో గొడవపడి ఓ యువతి ఇంట్లోంచి వెళ్లిపోయింది. దీంతో ఆ తల్లి దండ్రులు తమ కూతురు ఏమైనా అఘాయిత్యం చేసుకుంటుందని భయపడి 100కు డయల్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సదరు యువతిని కాపాడారు. ఈ ఘటన సారంగాపూర్ మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై దత్తాద్రి వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి తన తల్లిదండ్రులతో గొడవపడి ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని యువతి తల్లిదండ్రులు 100కు డయల్‌చేసి పోలీసులకు చెప్పారు. సారంగాపూర్ పోలీసులకు సమాచారం రావడంతో వెంటనే సదరు యువతి వెళ్లిన ప్రదేశాన్ని గుర్తించి అక్కడికి చేరుకున్నారు. అప్పటికే యువతి పురుగుల మందు తాగడానికి యత్నిస్తుండగా పోలీసులు కా పాడి, కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం త ల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసులు సకాలంలో స్పందించడంతో తమ కూతురు ప్రాణాలు దక్కాయని యువతి తల్లితండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment