చొప్పదండి: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించే జవహర్ నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు సిద్ధం చేశామని జేఎన్‌వీ ప్రిన్సిపాల్ మంగతాయారు తెలిపారు. నవోదయ సమావేశ మందిరంలో గురువారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పరీక్ష నిర్వాహకులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. 2025–26 విద్యా సంవత్సరంలో జేఎన్‌వీలో ఆరోతరగతి ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్షకు 6,806 మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. ఈ నెల 18న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 34 కేంద్రాల్లో పరీక్ష జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు ఉదయం 10 గంటల లోపే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. హాల్ టికెట్‌తో పాటు, ఏదేని గుర్తింపు కార్డు తీసుకురావాలని అభ్యర్థులకు సూచించారు. సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి డీఈవో అశోక్ రెడ్డి, జిల్లాల వారిగా అసిస్టెంట్ కమిషనర్లు పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లాలో 34 పరీక్ష కేంద్రాలు
ప్రిన్సిపాల్ మంగతాయారు
Comments
Please login to add a commentAdd a comment