మార్చిలోగా స్మార్ట్‌సిటీ పనులు పూర్తి
కరీంనగర్ కార్పొరేషన్: మార్చి గడువులోగా స్మార్ట్ సిటీ పనులను పూర్తి చేస్తామని నగర మేయర్‌యాదగిరి సునీల్‌రావు తెలిపారు. గురువారం నగరంలోని 13వ డివిజన్‌లోని వేంకటేశ్వరకాలనీ రోడ్ నెంబర్ 21లో రూ.35.75 లక్షలతో సీసీరోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు స్మార్ట్‌సిటీలో భాగంగా చేపట్టిన పనుల్లో 75 శాతం పూర్తయినట్లు తెలిపారు. మిగిలిన 25 శాతం పనులను మార్చిలోగా పూర్తిచేస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమాన వాటాగా రూ.వెయ్యికోట్లు నగరానికి కేటాయించగా, రూ.930 కోట్లతో వివిధ పనులు చేపట్టామన్నారు. రూ.796 కోట్ల పనులు పూర్తిచేసి బిల్లులు చెల్లించామన్నారు. మిగిలిన రూ.130 కోట్లతో చేపట్టిన పనులు చివరిదశలో ఉన్నాయన్నారు. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుల మొత్తం నిధుల నుంచి రూ.70 కోట్లు (ఏఎనఎం) పరిపాలన నిర్వహణ కోసం కేటాయించామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ, నగరపాలకసంస్థ డీఈ ఓం ప్రకాశ్, ఏఈ గట్టుస్వామి, వర్క్ ఇన్‌స్పెక్టర్ శ్రవణ్, డివిజన్ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
డీఈటీగా బాధ్యతల స్వీకరణ
కొత్తపల్లి: టీజీఎన్‌పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఆఫీసులో డివిజన్ ఇంజినీర్ (టెక్నికల్ అండ్ సెఫ్టీ ఆఫీసర్)గా కంచనపల్లి ఉపేందర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ కార్పొరేట్ కార్యాలయంలో డీఈ (ఎమ్మార్టీ అండ్ ఎనర్జీ, ఆడిట్ అసెస్‌మెంట్)గా పనిచేస్తున్న ఆయన డీఈటీగా కరీంనగర్‌కు బదిలీపై వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన ఉపేందర్ మర్యాదపూర్వకంగా ఎస్‌ఈ మేక రమేశ్‌బాబును కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. డీఈలు, ఎస్‌ఏవో, ఏవోలు, పీవో, ఏడీఈలు, ఉద్యోగులు అభినందనలు తెలిపారు.
క్వింటాల్ పత్తి రూ.7,300
జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్‌లో గురువారం క్వింటాల్ పత్తి రూ. 7,300 పలికింది. క్రయ విక్రయాలను ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్–2 కార్యదర్శి రాజాలు పర్యవేక్షించారు.
మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిగా సత్యప్రసన్న రెడ్డి●
● వరుసగా రెండోసారి నియామకం
కరీంనగర్ కార్పొరేషన్: మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలుగా వరుసగా రెండోసారి కర్ర సత్యప్రసన్నరెడ్డి నియమితులయ్యారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు. మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్క లంబా ఆదేశాల మేరకు రెండోసారి సత్యప్రసన్నరెడ్డి నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన బీసీసంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు సత్యప్రసన్న కృతజ్ఞతలు తెలిపారు. మహిళా కాంగ్రెస్ బలోపేతానికి మరింతగా కృషి చేస్తానన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
కరీంనగర్‌స్పోర్ట్స్: పట్టణంలోని రాంనగర్‌లో వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో భాగంగా కంప్యూటర్, బ్యూటీషియన్ కోర్సులకోసం ఆసక్తిగల యువతీ యువకులు ఉదయం 10: 30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా యువజన, క్రీడాశాఖ అధికారి వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఏడో తరగతి, ఆపైన తరగతుల్లో పాస్, ఫెయిలైన 18 ఏళ్లు నిండిన విద్యార్థులు, యువతులు అర్హులన్నారు. శిక్షణకాలం మూడు నెలలు ఉంటుందని, కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికెట్ అందజేయనున్నట్లు తెలిపారు. కంప్యూటర్ (ఎంఎస్ ఆఫీస్, డీటీపీ)–వెయ్యి, బ్యూటీషియన్ రూ.1500 ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు 9640967943, 9949850360 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment