స్థలాన్ని పరిశీలిస్తున్న డీఆర్‌వో తదితరులు
హోసూరు: ధర్మపురి జిల్లా పెన్నాగరంకు చెందిన రియల్టర్ ప్రకాష్(43) హత్యోదంతాన్ని సంబంధించి పోలీసులు ఛేదించారు. హతుడి భార్య లక్ష్మి, ఆమె ప్రియుడు చిన్నరాజ్‌ను అరెస్ట్ చేశారు. వివరాలు.. హోసూరు సమీపంలోని శ్యానమావు అటవీ ప్రాంతంలో మార్చి 19న కాలిన స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి శవం ఉన్నట్లు స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఉద్దనపల్లి పోలీసులు వెళ్లి పరిశీలించారు. మృతుడు ఎవరనేది తెలియకపోవడంతో మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. మృతుడు రియల్టర్ ప్రకాష్(43)గా తేలింది. అనుమానంతో అతని భార్య లక్ష్మి(36)ని అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. మొదట తనకేమీ తెలియలేదని బుకాయించింది. లోతుగా విచారణ చేపట్టగా అసలు విషయం బయట పెట్టింది. లక్ష్మీకి అదే ప్రాంతానికి ఆమె బాల్య స్నేహితుడు చిన్నరాజ్(36)తో వివాహేతర సంబంధం ఉంది. పెళ్లయినప్పటికీ అతనితో సంబంధం కొనసాగిస్తోంది. అయితే హతుడు ప్రకాష్ మద్యానికి బానిసై వేధిస్తుండటంతో ప్రియుడు చిన్నరాజ్ సహాయంతో కర్రతో బాది హత్య చేశారు.
భార్యతో పాటు ఆమె ప్రియుడు అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment