సోమవారం మైసూరు జూ వద్ద రద్దీ
బనశంకరి: క్రిస్మస్ సెలవులు రావడం, అలాగే న్యూ ఇయర్ జరుపుకోవడానికి బెంగళూరు నగరవాసులు పర్యాటక స్థలాలకు క్యూ కట్టారు. శనివారం నుంచి జాతీయ రహదారుల్లో టోల్‌గేట్లు, ప్రముఖ రోడ్లలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వరుస సెలవులు రావడంతో ప్రజలు రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక స్థలాలు, స్వంత ఊర్ల బాటపట్టారు. మైసూరు–బెంగళూరు ఎక్స్‌ప్రెస్ వే టోల్‌గేట్, నైస్‌రోడ్డు, తుమకూరురోడ్డు, హోసూరు రోడ్డు, ఆనేకల్, దొడ్డబళ్లాపుర, దేవసహళ్లి రోడ్లులో ఆదివారం ఉదయం నుంచి ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. ఎక్కువ సంఖ్యలో మైసూరువైపు ప్రయాణించడంతో ఎక్స్‌ప్రెస్ వే టోల్‌ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. తరనూరు–ఇస్నూరు వద్ద ఫాస్ట్ ట్యాగ్ రీచార్జ్ కావడం లేదు. దీంతో కొందరు వాహనదారులు రీచార్జ్ చేసుకోకుండా నగదు చెల్లించి వెళుతున్నారు. మెజస్టిక్ కేఎస్‌ఆర్‌టీసీ బస్టాండు, మైసూరురోడ్డు స్యాటిలైట్ , శాంతినగర బస్టాండుల్లో శని, ఆదివారం రాత్రి ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉంది. ఇక సోమ, మంగళవారాల్లో నగరానికి తిరిగి రావడం వల్ల మళ్లీ ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుంది.
మహాదేశ్వర బెట్టకు భక్తసాగరం
మైసూరు: సెలవుల నేపథ్యంలో చామరాజనగర జిల్లాలోని హనూరులో వెలసిన శ్రీ మలె మహాదేశ్వర కొండకు భక్తులు భారీగా వచ్చారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలు ఎక్కువగా దైవ దర్శనానికి వస్తున్నారు. దీంతో మహదేశ్వర బెట్టపై ఎక్కడ చూసినా రద్దీ నెలకొంది. అలాగే మైసూరులోని వన్యమృగ ప్రదర్శన శాలకు కూడా అధికసంఖ్యలో జనం రావడంతో కిటకిటలాడింది. మైసూరు ప్యాలెస్‌కు సందర్శకులు పోటెత్తారు.
టోల్‌గేట్ల వద్ద రద్దీ
మైసూరులో జనసందడి
Comments
Please login to add a commentAdd a comment