బెంగళూరు ఫ్రీడంపార్క్ వద్ద ధర్నా
శివాజీనగర: పాత కేసుల్లో అరెస్ట్ చేసిన కర సేవకులను 48 గంటలలోగా విడుదల చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. బుధవారం బెంగళూరులోని స్వాతంత్య్ర ఉద్యానవనంలో కరసేవకుల అరెస్ట్‌ను ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర, 31 ఏళ్ల క్రితం కరసేవలో పాల్గొన్నవారిపై అప్పట్లో కేసులు పెట్టారు, వారిని ఇప్పుడు అరెస్ట్ చేయడం సరికాదు. ముఖ్యమంత్రికి 48 గంటల గడువు ఇస్తాం. అరెస్ట్ అయిన కరసేవకుడు శ్రీకాంత్ పూజారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే యువమోర్చా ద్వారా హుబ్లీ పోలీస్ స్టేషన్‌ను ముట్టడిస్తామన్నారు. రాష్ట్రంలో మొఘలులు, తాలిబాన్ల పరిపాలన సాగుతోందా? అనే అనుమానం ఉందన్నారు. పెద్దసంఖ్యలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నేరస్తుల కోసం పోరాటమా: సీఎం
బనశంకరి: తప్పుచేసినవారికి శిక్షవేయరాదని బీజేపీ నేతలు పోరాడుతున్నారు, నేరాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని సీఎం సిద్దరామయ్య తెలిపారు. నాలుగేళ్ల అవినీతి పాలనలో కుంభకోణాలతో కాలం వెళ్లదీసిన బీజేపీకి తమ ప్రభుత్వ విజయాలతో ప్రజల్లో వస్తున్న స్పందన చూసి భయపడుతున్నారని దుయ్యబట్టారు. హుబ్లీలో క్రిమినల్స్‌ని అరెస్ట్ చేస్తే ఆ విషయాన్ని పట్టుకుని వేలాడుతున్నారని ఎద్దేవా చేశారు. నేరస్తులకు కులం, మతం రంగు పులమడం అత్యంత ప్రమాదకరమని అన్నారు.
సర్కారుకు బీజేపీ హెచ్చరిక
Comments
Please login to add a commentAdd a comment