ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు యో
యశవంతపుర: ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచే యోచనలో ఉన్నట్లు వాయువ్య కేఎస్ ఆర్టీసీ అధ్యక్షుడు రాజు కాగె తెలిపారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన తరువాత బస్సు టికెట్ చార్జీలను పెంచడంపై ప్రభుత్వం యోచిస్తోందని రాజు కాగె చెప్పారు. నారీ శక్తి యోజనలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ సౌలభ్యం కల్పించటం వల్ల సంస్థ నష్టాల్లో ఉందని చెప్పడం గమనార్హం.
డీజిల్‌తో పాటు బస్సుల విడిభాగాల ధరలు, సంస్థ నిర్వహణ ఖర్చు పెరగడం వల్ల చార్జీలను పెంచాలని భావిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో గత 10 ఏళ్లు నుంచి బస్సు చార్జీలను పెంచలేదన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ పథకం భారంగా ఉన్నా కూడా సంస్థను నడుపుకొంటూ వెళుతున్నట్లు చెప్పారు. సంస్థకు చెందిన ఆస్తులను అమ్మడంతో పాటు పాత భవనాలను నవీకరణ చేసి బాడుగలకు ఇస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment