కళాకారులకు ప్రాధాన్యత ఇవ్వాలి
రాయచూరు రూరల్: నేటి సమాజంలో నశించి పోతున్న నాటక రంగ కళాకారులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఏపీఎంసీ మాజీ ఉపాధ్యక్షుడు హన్మంతప్ప పేర్కొన్నారు. ఆదివారం రాత్రి పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో గురు పుట్టరాజ కళా బళగ జానపద నాటకోత్సవాలను జ్యోతి వెలిగించి మాట్లాడారు. కళాకారుల భవిష్యత్తును అంధకారంలో పడేయకుండా వారి భవిష్యత్తుకు బాటలు వేయాలన్నారు. కార్యక్రమంలో సుధాకర్, కిరణ్, సిద్దయ్య స్వామి, రాఘవేంద్ర, కృష్ణమూర్తి, రంజిత్, మహాలక్ష్మిలున్నారు.
సమగ్ర విచారణకు డిమాండ్
రాయచూరు రూరల్: జిల్లా కన్నడ సంస్కృతి శాఖాధికారిణి మంగళ నాయక్‌ను సస్పెండ్ చేయాలని కళాకారుడు అల్తాఫ్ రంగమిత్ర కోరారు. సోమవారం విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నాలుగేళ్లలో కళాకారుల నుంచి రూ.20 లక్షలు లంచం పుచ్చుకున్న అంశంపై విచారణకు హాజరు కాకుండా కాంట్రాక్ట్ పద్ధతిపై విదులు నిర్వహిస్తున్న శ్రీదేవి, సిద్దప్పలను విధుల నుంచి తొలగించిన అంశాలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి ఆమెను సస్పెండ్ చేయాలని ఒత్తిడి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment