సహకారంతో ఆర్థికాభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

సహకారంతో ఆర్థికాభివృద్ధి

Published Thu, Nov 21 2024 12:54 AM | Last Updated on Thu, Nov 21 2024 12:54 AM

సహకారంతో ఆర్థికాభివృద్ధి

సహకారంతో ఆర్థికాభివృద్ధి

రాయచూరు రూరల్‌: సహకార రంగంలో ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చని కిల్లే మఠాధిపతి శాంత మల్ల శివాచార్య, సోమవార పేట మఠాధిపతి అభినవ రాచోటి శివాచార్యలు అభిప్రాయ పడ్డారు. బుధవారం నగరంలో బీరేశ్వర సహకార బ్యాంక్‌ 220వ శాఖను ప్రారంభించి ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి శశికళ జొల్లే ఆధ్వర్యంలో గోవా, కర్ణాటక, మహారాష్ట్రల్లో ప్రజలకు, రైతులకు, ఉద్యోగులకు, వ్యాపారులకు ఉన్నత అవకాశాలు కల్పించారన్నారు. బ్యాంక్‌ మేనేజర్‌ శివపుత్ర మాట్లాడుతూ బీరేశ్వర సహకార సంఘంలో 3.91 లక్షల మంది సభ్యులు, రూ.3,890 కోట్ల డిపాజిట్లు, రూ.30.18 కోట్ల మేర రుణాలిచ్చారన్నారు. రూ.40 కోట్ల లా భాలతో సంఘం నడుస్తోందన్నారు. మాజీ ఎమ్మెల్సీ శంకరప్ప, కేఓఎఫ్‌ డైరెక్టర్‌ మహంతేష్‌ పాటిల్‌ అత్తనూరు, శేఖర్‌ పాటిల్‌, చెన్నప్ప పాటిల్‌లున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement