నేడు బీజేపీ ధర్నా
కోలారు : భూములను వక్ఫ్ బోర్డు పేరుమీదకు మార్పు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ నేడు శుక్రవారం నగరంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ బృహత్ ధర్నా నిర్వహిస్తున్నట్లు మాజీ ఎంపీ ఎస్ మునిస్వామి తెలిపారు. బుధవారం నగరంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తాలూకా కార్యాలయం ముందు మా భూమి మా హక్కు నినాదంతో బీజేపీ ధర్నా చేపట్టిందని తెలిపారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర, ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోక్, ఛలవాది నారాయణస్వామి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎవరి భూమి అయితే వక్ఫ్‌కు బదిలీ అయిందో వారందరూ వచ్చి ఆందోళనకు మద్దతు తెలిపారు. రైతులు, రైతు సంఘటనలు, ప్రజలు ధర్నాలో పాల్గొని మద్దతు తెలపాలని కోరారు. కోలారు కలెక్టర్ అక్రం పాషా కోవిడ్ విపత్తువేళ కార్మిక శాఖ కమిషనర్‌గా ఉన్న సమయంలో వందల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ... వక్ఫ్‌బోర్డు వల్ల ఇబ్బందులు పడ్డ ప్రతి ఒక్కరు దాఖలాలతో సహా ఆందోళనలో పాలు పంచుకోవాలని తెలిపారు. వక్ఫ్ కేసును సీబీఐ చేత విచారణ చేయించాలని డిమాండ్ చేస్తామన్నారు. ముఖ్యమంత్రి సూచించారని వక్ఫ్ శాఖ మంత్రి జమీర్ అహ్మద్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో 21 వేల ఎకరాల భూమిని వక్ఫ్ పేరుమీద మార్పు చేశారన్నారు. ప్రస్తుతం ఉన్న వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలని కేంద్రం త్వరలో వక్ఫ్‌చట్టానికి మార్పులు చేస్తున్న తరుణంలో విముక్తి లభించనుందని తెలిపారు. విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు ఓం శక్తి చలపతి, బివి మహేష్, మాగేరి నారాయణస్వామి, తిమ్మరాయప్ప, అరుణమ్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment