పొగాకు సేవనం హానికరం
హొసపేటె: పొగాకు సేవనం ఎంతో హానికరమని, విద్యార్థులు చెడు అవాట్లకు దూరంగా ఉండాలని హోస్పేట్ అసిస్టెంట్ కమిషనర్ పి.వివేకానంద తెలిపారు. జిల్లా పాలన యంత్రాంగం ఆధ్వర్యంలో హోస్పేట్‌లోని మహిళా సమాఖ్య, ఇంగ్లిషు మీడియం సీనియర్ ప్రైమరీ, హైస్కూల్‌లో గురువారం జరిగిన పొగాకు రహిత ప్రచార అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. నేటి యువత దురలవాట్లకు బానిసలవుతున్నారని, తల్లిదండ్రులు వీరిపై నిఘా ఉంచాలన్నారు. చెడు వ్యసనాల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. జిల్లా ఆర్‌సీహెచ్ అధికారి డాక్టర్.జంబయ్య మాట్లాడుతూ... ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 60 రోజుల పాటు పొగాకు రహిత యువభేరి కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలోని 160 పాఠశాలలు, కళాశాలల్లో ఈ ప్రచారం నిర్వహించారు. రానున్న రోజుల్లో జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పొగాకు రహిత ప్రచారాన్ని చేపడతామన్నారు. పొగాకులో 5 వేల హానికర రసాయనాలు ఉన్నాయన్నారు. కర్ణాటకలో 22.8 శాతం మంది పొగాకు వినియోగిస్తున్నారు. దాదాపు 25 శాతం మంది క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. కాబట్టి పిల్లలు పొగాకు దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో డీడీపీయు అసిస్టెంట్ డైరెక్టర్ నాగరాజ హావల్దార్, వైద్యులు రాధిక, బసవరాజ్, ఉపాధ్యాయుల, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment