విజయేంద్రకు చేతకావడం లేదు
హుబ్లీ: విజయేంద్రకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని నిర్వహించడం చేతకావడం లేదు. ఆయనను అధ్యక్ష పదవి నుంచి తక్షణమే మార్చాలని బీజేపీ నేత రమేష్ జార్కిహోళి తెలిపారు. బెళగావిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ యడియూరప్ప పుట్టుకతోనే పోరాటయోధుడు. విజయేంద్ర యడియూరప్ప కాలి గోటికి కూడా సమానం కాదు. జీన్స్ ప్యాంట్, టీ షర్ట్ వేసుకొని తిరిగే వయస్సు ఆయనది. కావాలంటే నాలుగేళ్ల తర్వాత విజయేంద్రకు ఆ పదవిని కట్టబెట్టవచ్చని అభిప్రాయపడ్డారు. ఒకే సామాజిక వర్గానికి అధ్యక్ష పదవి వద్దని అందరినీ సమానంగా చూసే సమర్థులకు ఆ పదవిని కట్టబెట్టాలన్నారు. యత్నాళ్‌కు బీజేపీ కేంద్ర కమిటీ షోకాజ్ నోటీస్ జారీపై మాట్లాడిన ఆయన ఆ నోటీస్ వచ్చింది నేడు కాదు, రెండు రోజుల క్రితమే వచ్చింది. మీడియాతో నీడను చూపుతున్నారని, మేమంతా యత్నాళ్ వెంట ఉండి అధిష్ఠానానికి నచ్చజెబుతామన్నారు. విజయేంద్రతో లింగాయతులు, వక్కలిగులు లేరని స్పష్టం చేశారు. విజయేంద్ర బీసీ నేతలను తనకు మద్దతు ఇవ్వాలని బెదరిస్తున్నారన్నారు. ఆయన వెంట చాలా మంది బీసీ నేతలు ఉన్నారన్నారు. లింగాయతులు, వక్కలిగలు ఒక్కరూ కూడా లేరన్నారు. రేణుకాచార్య రాజకీయ మనుగడ కోసం విజయేంద్ర వెంట ఉన్నారన్నారు. ఎవరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కావాలన్నది నేను బహిరంగంగా వెల్లడించనన్నారు. అంతర్గత సమావేశంలో తన అభిప్రాయం వెల్లడిస్తానన్నారు. ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలను తాము కలవబోమన్నారు. ఫిర్యాదు చేయడానికీ వెళ్లడం లేదన్నారు. వక్ఫ్ బోర్డుపై జేపీసీ కమిటీ నివేదిక ఇవ్వడానికి వెళుతున్నామని, బీజేపీ హైకమాండ్‌ను కలవబోమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment