హుబ్లీ: పెరుగుతున్న నగరీకరణ, మారుతున్న ఆహార పద్ధతులు, జీవన శైలి వల్ల స్థూలకాయం, మధుమేహం వంటి వ్యాధులు పెరుగుతున్నాయి. భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ రెండు వ్యాధులు మానవాళికి సవాల్‌గా మారాయని ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ జీబీ సత్తురా తెలిపారు. సత్తూరు ఎస్‌డీఎం వైద్య కళాశాల, వైద్య చికిత్స విభాగం తదితర సంస్థల ఆధ్వర్యంలో ఆ కళాశాల మీటింగ్ హాల్‌లో జరిగిన హార్మోని, హార్మని అనే విషయం గురించి ఏర్పాటు చేసిన ఒక రోజు సదస్సులో ఆయన మాట్లాడారు. దేశ ప్రజల్లో ఏడాదికేడాది స్థూలకాయ ప్రమాణం పెరుగుతోందని, ఇది గుండెపోటుకు కారణం అవుతోందన్నారు. ప్రస్తుతం భారత్‌లో 77 మిలియన్ల మంది చక్కెర వ్యాధితో బాధపడుతున్నారని నివేదిక స్పష్టం చేసిందన్నారు.
వచ్చే ఏడాదికి మరింత పెరుగుదల
రాబోయే సంవత్సరంలో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు. భారతీయుల్లో తిన్ ఫ్యాట్ అంటే చేతులు కాళ్లు పలుచగా, అలాగే కడుపుపై కొవ్వు సేకరణ అవుతోందన్నారు. దీన్ని వల్ల బీపీ, షుగర్‌కు దారి తీస్తుందన్నారు. అందవల్ల రోజు 45 నిమిషాల పాటు వాకింగ్, ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు శారీరక కార్యకలాపాలు, పౌష్ఠికాహార సేవనం ద్వారా ఉత్తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. అంతకు ముందు ఎస్‌డీఎం విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ నిరంజన్ కుమార ప్రారంభించిన ఈ సదస్సులో సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ హెగ్డే, డాక్టర్ అఖిల, డాక్టర్ శిల్ప అక్కితో పాటు ఆ సంస్థ వివిధ విభాగాల ప్రిన్సిపల్, డిప్యూటీ ప్రిన్సిపల్‌తో పాటు 200 మందికి పైగా లెక్చరర్లు పాల్గొన్నారు.
మారుతున్న ఆహార పద్ధతులు, జీవన శైలే కారణం
ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ జీబీ సత్తురా
Comments
Please login to add a commentAdd a comment