లోకాయుక్త విచారణకు మంత్రి జమీర్‌ | - | Sakshi
Sakshi News home page

లోకాయుక్త విచారణకు మంత్రి జమీర్‌

Published Wed, Dec 4 2024 1:30 AM | Last Updated on Wed, Dec 4 2024 1:30 AM

-

శివాజీనగర: అక్రమ ఆస్తుల కేసులో మంత్రి జమీర్‌ అహమ్మద్‌ ఖాన్‌ లోకాయుక్త విచారణకు హాజరయ్యారు. గతంలో బెంగళూరులో ఆయన ఇల్లు, ఆఫీసులపై ఏసీబీ దాడి జరిపింది. ఈ సమయంలో కేసు రద్దు కోరుతూ కోర్టు, సుప్రీం కోర్టుకు జమీర్‌ ఆశ్రయించారు. అయితే హైకోర్టు, సుప్రీం కోర్టులో ఆయన అర్జీలను తిరస్కరించారు. ఆ సోదాల్లో ఏసీబీ అతి ప్రాముఖ్యమైన ఆధారాలను స్వాధీనం చేసుకుంది. సంపాదనకు మించి ఆస్తులు ఉన్నట్లు తెలిసి తనిఖీ చేపట్టింది. ఆ తరువాత ఏసీబీ రద్దయి లోకాయుక్త ఏర్పాటు కావడం తెలిసిందే. కేసును ఇప్పుడు లోకాయుక్త చేపట్టింది. నోటీసుల నేపథ్యంలో లోకాయుక్త ఆఫీసులో విచారణకు హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement