బొలెరో బోల్తా.. ఇద్దరు మృతి
సాక్షి,బళ్లారి: బొలెరో వాహనం బోల్తా పడి ఇద్దరు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. శనివారం తెల్లవారు జామున జిల్లాలోని కురుగోడు తాలూకా మదిరె క్రాస్ సమీపంలో బొలెరో వాహనం బోల్తా పడటంతో వాహన డ్రైవర్ బాదనహట్టికి చెందిన రంగప్ప(35), కల్యంకు చెందిన పరమేష్(32)లు అక్కడికక్కడే మృతి చెందగా, ఉమేష్‌గౌడ, ఎర్రప్పగౌడ అనే మరో ఇద్దరు గాయపడినట్లు స్థానికులు తెలిపారు.ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పల్లెల్లో రేషన్ షాపులు, లబ్ధిదారుల నుంచి సేకరించిన రేషన్ బియ్యాన్ని తీసుకుని అక్రమంగా వాహనంలో తరలిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది. వాహనం బోల్తా పడిన సమయంలో బియ్యం సంచులు కూడా బోలెరో పక్కన పడిపోవడంతో వెంటనే సంబంధిత వ్యక్తులు బియ్యాన్ని పక్కకు తరలించినట్లు సమాచారం. రేషన్ బియ్యం వాహనం చుట్టుపక్కల అక్కడక్కడ కొంత చెల్లా చెదరుగా పడి ఉండటంపై సంబంధిత అధికారులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. జిల్లాలో విచ్చల విడిగా రేషన్‌బియ్యం పక్కదారి పడుతున్నా పట్టించుకోకపోవడంతో రాత్రిళ్లు భయం భయంగా వాహనాలు నడపటంతో మూడు రోజుల నుంచి విపరీతమైన మంచు కురుస్తున్న తరుణంలో తెల్లవారుజామున వాహనాలు వెళ్లేటప్పుడు ప్రమాదం జరిగిందని సమాచారం. డ్రైవర్‌కు మంచు వల్ల ముందు ఏమీ కనిపించకపోవడంతో వాహనం బోల్తా పడిందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.మృతదేహాలను విమ్స్‌కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. జిల్లా పోలీసు అధికారులు కూడా ఘటన స్థలాన్ని పరిశీలించి కేసును దర్యాప్తు చేస్తున్నారు.
మరో ఇద్దరికి గాయాలు
అక్రమంగా రేషన్ బియ్యం
తరలిస్తుండగా ప్రమాదం?
Comments
Please login to add a commentAdd a comment