● స్పెయిన్‌వాసి ఇంట్లో చోరీ
బనశంకరి: స్పెయిన్‌దేశానికి చెందిన పౌరుని ఇంట్లోకి దొంగలు పడి విలువైన సొత్తును దోచుకున్నారు. ఈ ఘటన నగరంలో అశోక్‌నగర పోలీస్‌స్టేషన్ పధిదిలో చోటుచేసుకుంది. వివరాలు.. ఈనెల 15 తేదీ రాత్రి అశోక్‌నగర ల్యాంగ్‌పోర్టు టౌన్‌లో స్పెయిన్ దేశస్తుడు జీసస్ అబ్రిల్ ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు. అబ్రిల్ మరో గదిలోకి వెళ్లి లాక్ చేసుకున్నాడు. ఫోన్ ద్వారా పోలీసులకు కాల్ చేశాడు, ఇంగ్లీష్ లో వివరించలేక ఇబ్బందిపడ్డాడు. స్పానిష్ అర్థం కాకపోవడంతో సహాయవాణి సిబ్బంది కాల్ కట్ చేశారు. ఈ సమయంలో దొంగలు ల్యాప్‌టాప్ , ప్లాటినం ఉంగరం, ఐడీకార్డు, డ్రైవింగ్‌లైసెన్సు, డెబిట్ కార్డులతో పాటు కొంత నగదును ఎత్తుకెళ్లారు. మరుసటి రోజు ఉదయం 8.30 సమయంలో ఇంటి యజమానికి ఫోన్ చేసి ఆయన సాయంతో స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేశాడు. ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న అబ్రిల్ రెండేళ్లుగా బెంగళూరులో ఉంటున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment