మైసూరు: కారు, స్కూటర్‌ను జీపు ఢీకొని ఓ మహిళ మరణించగా, మరొకరు గాయపడిన ఘటన నగరంలోని బోగాది రింగు రోడ్డులోని రామణ్ణ సర్కిల్ వద్ద జరిగింది. తాలూకాలోని కె.హెమ్మనహళ్లి నివాసి ప్రతాప్ భార్య రూప (38) మరణించగా, కారు ప్రయాణికురాలు మహదేవమ్మ గాయపడ్డారు. కేరళకు చెందిన హర్షద్ జీపులో వేగంగా వస్తుండగా అదుపు తప్పి పక్కనున్న సర్వీస్ రోడ్డులోకి జీపు ఎగిరి పడింది. ఆ సమయంలో ఎదురుగా స్కూటర్‌లో వస్తున్న రూపను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మరణించారు. తరువాత మరో కారును కూడా ఢీకొనడంతో కారులోని మహదేవమ్మకు స్వల్ప గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. డీసీపీ జాహ్నవి, ఏసీపీ పరశురామప్ప ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రూప భర్త ప్రతాప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జీపు డ్రైవర్ హర్షద్‌పై కేఆర్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు.
స్కూటరిస్టు మృతి
Comments
Please login to add a commentAdd a comment