మాట్లాడుతున్న ప్రేమేంద్ర సేత్, కేదార్ జయప్రకాశ్
ఖమ్మం మామిళ్లగూడెం : ఈనెల 27న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగసభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరవుతారని, సభను జయప్రదం చేయాలని గోవా రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు ప్రేమేంద్ర సేత్, కేదార్ జయప్రకాశ్‌నాయక్ కోరారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తెలంగాణ కూడా ఉందని, ఎమ్మెల్యే ప్రవాస యోజనలో భాగంగా పార్టీ బలోపేతం చేసేందుకే తాము ఇక్కడికి వచ్చామని తెలిపారు. ఖమ్మం జిల్లాలోని 341 బూత్ కమిటీలను సందర్శించి కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతామన్నారు. జిల్లాలో బీజేపీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని చెప్పారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు బరిలో ఉంటారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం దోచుకుంటోందని, ఈ నిరంకుశ పాలనకు ప్రజలు చరమగీతం పాడనున్నారని జోస్యం చెప్పారు. బీజేపీలో సామాన్య కార్యకర్త సైతం ప్రజాప్రతినిధి కాగలరనడానికి తానే ఉదాహరణ అని ప్రేమేంద్ర సేత్ తెలిపారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శులు రుద్ర ప్రదీప్, శ్యాంరాథోడ్, ఉపాధ్యక్షురాలు మంద సరస్వతి, నాయకులు డాక్టర్ శీలం పాపారావు, మన్‌కీబాత్ రాష్ట్ర కోఆర్డినేటర్ గెంటెల విద్యాసాగర్, మహిళామోర్చా జిల్లా అధ్యక్షురాలు దొడ్డా అరుణ, దిద్దుకూరి వెంకటేశ్వరావు, ఖమ్మం అసెంబ్లీ కన్వీనర్ అల్లిక అంజయ్య, డీకొండ శ్యామ్ పాల్గొన్నారు.
గోవా ఎమ్మెల్యేలు ప్రేమేంద్ర సేత్, జయప్రకాశ్
Comments
Please login to add a commentAdd a comment