ప్రభుత్వ కళాశాలకు పూర్వ వైభవం తెస్తా
●ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ●వైభవంగా కళాశాల స్వర్ణోత్సవాలు
పాల్వంచరూరల్: ప్రభుత్వ జూనియర్ కళాశాలకు పూర్వవైభవాన్ని తీసుకొస్తానని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మండల పరిధిలోని బస్వతారాకకాలనీ గ్రామపంచాయతీలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల స్వర్ణోత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పూర్వవిద్యార్థులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటపాటలతో వేడుకలు సాగాయి. ఎమ్మెల్యే కళాశాల ప్రాంగణంలోని సరస్వతిదేవికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యేతోపాటు పూర్వగురువులను కళాశాల ప్రిన్సిపాల్ శంకర్, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కళాశాలకు ప్రహారి, అదనపు తరగతి గదులు మంజూరు కోసం కృషిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వివేక్, జిల్లా ఇంటర్ విద్యాధికారి సీహెచ్ వెంకటేశ్వరరావు, పూర్వపు ప్రిన్సిపాల్స్ విజయ పూర్ణిమ, రామచందర్, శ్రీనివాసరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కె.సాబిర్‌పాషా, సీపీఐ, కాంగ్రెస్ నాయకులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment