సుజాతనగర్: మండలంలోని వేపలగడ్డలో ఆదివారం గంజాయిని పట్టుకున్నట్లు ఎస్సై ఎం.రమాదేవి తెలిపా రు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వేపలగడ్డ ధనలక్ష్మి వెంచర్ సమీపంలో కొంతమంది వ్యక్తుల వద్ద గంజాయి ఉందన్న సమాచారంతో ఎస్సైతో పాటు హెడ్ కానిస్టేబుల్ ఓ.చంద్రశేఖర్, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు కలిసి దాడి చేశారు. దీంతో ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి సుమారు రూ.45,525 విలువ గల గంజాయి, స్కోడా కారు, ఒక హోండా స్కూటీ, ఏడు సెల్ ఫోన్లు స్వాధీనపరచుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. పట్టుబడిన వారిలో చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీకి చెందిన రాహుల్, బొంకూరు రోహిత్, రామవరం నాగయ్యగడ్డకు చెందిన పర్లపల్లి ఉదయ్‌కిరణ్, చుంచుపల్లికి చెందిన ముప్పాల అభిషేక్, నిఖిల్, కొత్తగూడెం రామటాకీస్ ఏరియాకు చెందిన సిర్ల సాయికిరణ్, విద్యానగర్‌కు చెందిన మనబోతుల సాత్విక్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment