బారేవాడలో మృతి చెందిన ఎద్దు
భీమిని(బెల్లంపల్లి): కన్నెపల్లి మండల కేంద్రంలోని బారేవాడలో సోమవారం విద్యుత్ షాక్‌తో ఎద్దు మృతి చెందింది. కన్నెపల్లికి చెందిన నికాడి శ్రీనుకు చెందిన ఎద్దు బారేవాడలోని ట్రాన్స్‌ఫార్మర్ ఎర్త్‌వైర్‌కు తగలడంతో విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందింది. ఎద్దు విలువ రూ.40 వేల వరకు ఉంటుందని, ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.
డీఎంహెచ్‌వో కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్
మంచిర్యాలటౌన్: జిల్లా వైద్యాధికారి కార్యాలయంలోని మలేరియా విభాగంకు సంబంధించిన గదిలో సోమవారం సాయంత్రం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. అందులో ఉన్న దోమ తెరలు, యాంటి మలేరియా కెమికల్స్, దోమల నివారణకు వినియోగించే రసాయనాలు, స్ప్రే చేసే మందులు దగ్ధమయ్యాయి. ఫైరింజన్ వచ్చి మంటలను ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. గతేడాది డిసెంబర్ 10న జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆవరణలో గల డీడీఎంహెచ్‌వో కార్యాలయంలో నిల్వ ఉంచిన వ్యాక్సిన్ల గదిలోనూ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి ఫ్రిజ్‌లు, వ్యాక్సిన్లు పూర్తిగా కాలిపోయాయి. మూడు నెలల్లోనే రెండు విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకుని లక్షల విలువజేసే మందులు, వ్యాక్సిన్లు, ఫ్రిజ్‌లు, సామగ్రి ఆహుతి కావడం ఆందోళన కలిగిస్తోంది.
చికిత్స పొందుతూ యువకుడు మృతి
కెరమెరి(ఆసిఫాబాద్): ఈ నెల 7న రోడ్డు ప్రమాదానికి గురైన కుమురం సెడ్మారావు (23) చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. మండలంలోని కెస్లాగూడకు చెందిన సెడ్మారావు ఈ నెల 7న హోలి పర్వదినం సందర్భంగా కొట్నాక కిరణ్ కుమార్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై జైనూర్ మండలం అడ్డేసర గ్రామానికి వెళ్లి వస్తుండగా దేవాపూర్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ముందుగా కెరమెరికి, అక్కడినుంచి ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, ఆతర్వాత హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించడంతో ఆదివారం రాత్రి మృతి చెందాడు. కాగా కిరణ్ కుమార్ మంచిర్యాలలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
దత్తాత్రేయకు జ్యోతిష్య విశారద అవార్డు
మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలోని తిలక్‌నగర్‌కు చెందిన తాడూరి దత్తాత్రేయ ఆచార్య జ్యోతిష్య విశారద అవార్డుకు ఎంపికయ్యారు. విశ్మకర్మ పీఠం చారిటబుల్ ట్రస్టు మూడేళ్లుగా ఉగాదిని పురస్కరించుకుని సనాతన హైందవ సంస్కృతి సంప్రదాయాలను విస్తరింపజేస్తున్న వారికి ఈ పురస్కారం అందజేస్తోంది. గుంటూరు జిల్లా చుట్టగంటలో పోలేరమ్మ దేవాలయం వద్ద ఈ నెల 19న ఈ అవార్డును అందుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment