‘ఎస్సీ వర్గీకరణతోనే అభివృద్ధి’
తిర్యాణి(ఆసిఫాబాద్): ఎస్సీ వర్గీకరణ సాధించడం ద్వారానే మాదిగల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధి కార ప్రతినిధి బి.సతీశ్, జాతీయ నాయకుడు రేగుంట కేశవ్‌రావు అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించే వేల గొంతులు.. లక్ష డప్పులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శుక్రవారం మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. కుమురంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంత రం వారు మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పు ద్వారా వర్గీకరణ పోరాటం ఫలించినా.. కొంతమంది ఆపేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో నిర్వహించే కార్యక్రమానికి ప్రతీ ఇంటి నుంచి ఒక్కో డప్పు తీసుకుని రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కొండ్ర బ్రహ్మయ్య, నాయకులు ప్రభాకర్, ఇప్ప నాగరాజు, అశోక్, వెంకటేశ్, రాజేశ్, అరవింద్, రవి, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment