వైభవంగా గణతంత్ర వేడుకల నిర్వహణ
రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియాలో గణతంత్ర దినోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు ఏరియా జనరల్ మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయంలో శుక్రవారం గణతంత్ర వేడుకల ఏ ర్పాట్లపై అన్ని విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జీఎం మాట్లాడుతూ అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. భీమన్న స్టేడియాన్ని సిద్ధం చేయాల ని సూచించారు. విద్యార్థుల పిరమిడ్, పరేడ్ నృత్యాలు ఆకర్షణీయంగా ఉండేలా చూడాలన్నారు. గోలేటి, మాదారం టౌన్‌షిప్‌ల నుంచి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌వోటూజీఎం రాజమల్లు, పీవో నరేందర్, డీజీఎం సెక్యూరిటీ ఉమాకాంత్, పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్ల తిరుపతి, సివిల్ ఎస్‌ఈ మదీనా బాషా, ఫైనాన్స్ మేనేజర్ రవికుమార్, ఐటీ ఇన్‌చార్జి ముజీబ్, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment