వెంటనే రెమ్యూనరేషన్ చెల్లించాలి
ఆసిఫాబాద్‌రూరల్: ఉపాధ్యాయులకు సమ గ్ర కుటుంబ సర్వే రెమ్యూనరేషన్ వెంటనే చెల్లించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు శాంతికుమారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం ఏవో మధుకర్‌కు వినతిపత్రం అందించారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలో వందలాది మంది ఉపాధ్యాయులు కుటుంబ సర్వేలో పాల్గొని, నవంబర్‌లో అధికారులకు సర్వే రిపోర్టు అందించారని తెలిపారు. అధికారులు స్పందించి రెమ్యూనరేషన్ చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఇందురావు, కోశాధికారి రమేశ్, నాయకులు హేమంత్, సుభాష్, నవీన్ తదితరలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment