రోడ్డు భద్రతపై అవగాహన
వాంకిడి(ఆసిఫాబాద్): మండలంలోని ఇందాని ఎక్స్‌రోడ్ వద్ద రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం వాహనదారులకు అవగాహన కల్పించారు. మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ జి.మోహన్ రోడ్డు భద్రత నిబంధనలను వివరించారు. ఆయన మాట్లాడుతూ మద్యం తాగి వాహనం నడపడం, హెల్మెట్ లేని ప్రయాణం, అతివేగం ప్రమాదాలకు కా రణమవుతుందని తెలిపారు. ప్రయాణ సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించా రు. కార్యక్రమంలో అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు రాజమల్లు, చంద్రశేఖర్, కానిస్టేబుళ్లు రవి, వాహిద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment