● జిల్లాలో బడిబయటి పిల్లల సర్వే ● ఇప్పటికే 108మంది గుర్
కెరమెరి(ఆసిఫాబాద్): పిల్లలు పనిలో కాదు.. బడిలో ఉండాలన్నా సదుద్దేశంతో ఈ నెల 10నుంచి ప్రారంభించిన బడిబయటి పిల్లల సర్వే జిల్లాలో వి జయవంతంగా కొనసాగుతోంది. క్షేత్రస్థాయిలో సీ ఆర్పీలు సర్వే నిర్వహిస్తున్నారు. గతేడాది 648 మందిని గుర్తించి ప్రబంద్ పోర్టల్‌లో నమోదు చేశారు. ఈసారి గతం కంటే ఎక్కువ సంఖ్యలో బడిబయటి పిల్లలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ఏటా పెరుగుతున్న సంఖ్య
తల్లిదండ్రుల నిర్లక్ష్యమో.. లేదా టీచర్ల పట్టింపు లేని తనమో తెలియదు గాని ఏటేటా బడిబయటి పిల్లల సంఖ్య పెరుగుతూనే ఉంది. జిల్లాలో 335 గ్రామపంచాయతీల్లో 52మంది సీఆర్పీలు ఈ నెల 10 నుంచి సర్వే ప్రారంభించారు. సంక్రాంతి సెలవుల కారణంగా సర్వేలో కొంత జాప్యం జరిగింది. పాఠశాలలు మళ్లీ 18వ తేదీ నుంచి ప్రారంభం కావడంతో సర్వే ను సీఆర్పీలు వేగవంతం చేశారు. తొమ్మిది రోజులు గా జిల్లాలోని ఆవాస ప్రాంతాల్లో సర్వే నిర్వహిస్తున్నారు. శనివారం వరకు జిల్లాలో 284 హ్యాబిటేషన్లలో 108 మంది బడిబయటి, బడి మానేసిన పిల్లలను గుర్తించారు. వీరిని ఇంకా ప్రబంద్ పోర్టల్‌లో నమోదు చేయలేదు. ఈ సర్వే ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగనుంది.
ప్రత్యేక అవగాహన
బడిబయటి పిల్లల సర్వేను పకడ్బందీగా నిర్వహించాలనే ఉద్దేశంతో డీఈవో, సెక్టోరల్ అధికారులు గ త నెల 16న జూమ్ మీటింగ్ ద్వారా ఎంఈవోలు, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్, సీసీ వో, సీఆర్పీలకు ప్రత్యేక అవగాహన కల్పించారు. రాష్ట్ర స్థాయి అధికారులు సర్వేలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బడిబయటి పిల్లలు ఒక్కరూ మిగలకుండా, నిక్కచ్చిగా సర్వే నిర్వహించాలని సూచించారు.
సీఆర్పీలే కీలకం
బడిబయటి పిల్లలను గుర్తించడమే కాదు.. వారిని బడిలో చేర్పించాల్సిన బాధ్యత కూడా సీఆర్పీలపై ఉందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే సర్వేల్లో గుర్తించిన బడిబయటి పిల్లల్లో సు మారు 15 మందిని బడిలో చేర్పించినట్లు తెలుస్తోంది. వరుసగా 30 రోజులు హాజరు కాని విద్యార్థుల ను గుర్తించి తిరిగి బడికి హాజరయ్యేలా చేస్తున్నారు. గుర్తించిన పిల్లల్లో పాఠశాల వయస్సు వారిని తగిన తరగతిలో సమీప పాఠశాలలో లేదా యూఆర్‌ఎస్ లో నమోదు చేసే అవకాశాన్ని కల్పించారు. గతేడా ది జిల్లాలో 6–14 ఏళ్ల పిల్లలను బడిలో చేర్పించగా సెకండరీ ఎడ్యుకేషన్ విద్యార్థుల్లో కొందరికి ఓపెన్ స్కూల్, ఇంటర్‌లో ప్రవేశం కల్పించారు.
ప్రత్యేక పాఠశాలల ఏర్పాటు
పొరుగునే ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన కుటుంబాల్లోని పిల్లలకూ చదువు నేర్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ సర్వేలో ఇటుక బట్టీలు, భవన నిర్మాణం, కులవృత్తలు తదితర రంగాల్లో తల్లిదండ్రులతో కలిసి పని చేసేవారినీ గుర్తించనున్నారు. 6–14 ఏళ్లవారు ఒకేచోట 10 మంది పిల్ల లుంటే తాత్కాలికంగా సమీపంలో నాన్ రెసిడెన్సియల్ (ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ) స్కూల్ ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేక విద్యావలంటీర్లను నియమించి మూడు నుంచి ఆరు నెలల పాటు ఆయా రాష్ట్రాల భాషతోపాటు తెలుగు నేర్పించేలా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఆ తర్వాత పిల్లలను కేజీబీవీ, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో చేర్పిస్తారు. 15 నుంచి 19 ఏళ్లు గలవారిని ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్‌లో చేర్పించడంతో పాటు పీజురీయింబర్స్‌మెంట్ సదుపాయం కల్పిస్తారు.
పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి
జిల్లాలోని అన్ని ఆవాస ప్రాంతాల్లో బడిబయటి పిల్లల ను గుర్తించేందుకు సర్వే కొనసాగుతోంది. గుర్తించిన పిల్ల లను ప్రబంద్ పోర్టల్‌లో అప్‌లో డ్ చేయాలి. బడిబయటి పిల్లలను బడిలో చేర్పించాలి. కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, ఎంఈవోలు పర్యవేక్షిస్తున్నారు. గతేడాది కంటే ఎక్కువమంది పిల్లలను గుర్తించాలి.
– శ్రీనివాస్, జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్
రవాణా భత్యం చెల్లించాలి
జిల్లాలో ఆయా కాంప్లెక్స్‌ల పరిధిలో వి ధులు నిర్వహిస్తున్న ఆర్పీలు సర్వేలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వం రవాణా భత్యం ఇవ్వాలి. ప్రతీరోజు పాఠశాలల పర్యవేక్షణ కోసం వెళ్లాల్సి ఉంటుంది. పెరుగుతున్న ని త్యావసరాల ధరల నేపథ్యంలో ప్రభుత్వం అందిస్తున్న వేతనం సరిపోక ఇబ్బంది పడుతున్నాం. – పవన్‌కుమార్,
సీఆర్పీల సంఘం జిల్లా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment