బొక్కివాగు ప్రాజెక్ట్ వద్ద బర్డ్ వాక్
పెంచికల్‌పేట్: అటవీశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో పక్షుల అధ్యయనానికి బర్డ్ వాక్ కార్యక్రమాన్ని ఎ ల్లూర్ బొక్కివాగు ప్రాజెక్ట్ వద్ద కాగజ్‌నగర్ సబ్‌కలెక్టర్ శ్రద్ధాశుక్లా ఎఫ్‌డీవో సుశాంత్ సుఖ్‌దీర్‌తో కలిసి శనివారం ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 14 మంది ఔత్సాహికులు క్షేత్రపర్యటనకు వచ్చారు. రేంజ్ పరిధిలోని చెరువులు, కుంటలు, పెద్దవాగు, ప్రాణహిత పరిసర ప్రాంతా ల్లోని ప్రకృతి, పక్షులను బంధిస్తూ ముందుకు సాగా రు. పాలరాపు గుట్ట వద్ద గల రాబంధుల స్థావరా న్ని సందర్శించి వివరాలు నమోదు చేసుకున్నారు. అనంతరం అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి న సఫారీల్లో అటవీ ప్రాంతాల్లో పర్యటిస్తూ పక్షులను కెమెరాల్లో బంధించారు. పెంచికల్‌పేట్ ఎఫ్ ఆర్వో అనిల్‌కుమార్, ఎఫ్‌ఎస్వో జగన్, జమీల్, ఆస్మా, ఎఫ్‌బీవోలు, సిబ్బంది పాల్గొన్నారు.
సిర్పూర్(టి): అటవీశాఖ ఆధ్వర్యంలో శనివారం సిర్పూర్(టి) అటవీశాఖ రేంజ్ పరిధిలో మొదటిరోజు బర్డ్‌వాక్ నిర్వహించారు. మూడో బర్డ్‌వాక్ ఫెస్టివల్‌లో భాగంగా అటవీశాఖ అధికారులు, జంతు ప్రేమికులు, పర్యాటకులు దేశీ, విదేశీ పక్షులను తమ కెమెరాల్లో బంధించారు. సిర్పూర్(టి) రేంజ్ పరిధిలోని చింతకుంట సెక్షన్ పరిధిలోని నీటి కుంటలు, హీరాపూర్ వాగు, జీడి వాగు ప్రాంతాల్లో పర్యటించి పక్షుల ఫొటోలు తీశారు. ఎఫ్‌డీవో సుశాంత్ బొబడే, ఎఫ్‌ఆర్వో ఇక్బాల్ హుస్సేన్, సెక్షన్ అధికారులు మోహన్‌రావ్, ప్రసాద్‌రావ్, బీట్ అధికారి మల్లికార్జున్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment