అర్హులకే కొత్త కార్డులు
పేరు లేకుంటే ఆందోళన వద్దు
ఆసిఫాబాద్: రేషన్ కార్డుల అర్హుల జాబితాలో పేర్లు లేనివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ నెల 21 నుంచి నిర్వహించనున్న గ్రామసభల్లో దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర మంత్రులు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు సూచించారు. కుల సామాజిక, ఆర్థిక సర్వే, పాత రేషన్ కార్డుల ఆధారంగా పేర్లు న మోదు చేసినట్లు తెలిపారు. శనివారం హైదరాబాద్ నుంచి కొత్త రేషన్‌కార్డులు, ఇందిర మ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి కలెక్టర్లతో వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందే వరకూ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందజేయాలనేదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్ పాల్గొన్నారు.
ఆసిఫాబాద్: ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించింది. సమగ్ర కులగణన సర్వే ప్రాతిపదికన ఈ నెల 16నుంచి అర్హుల గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైంది. సంబంధిత అధికారులు గడపగడపకూ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. తాజాగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించారు. దీంతో పాటు గ్రామసభల్లో కొత్తవారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. పాత కార్డుల తొలగింపు ఉండదని, కొత్తవారు గ్రామసభల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. జిల్లాలో చాలామంది అర్హులు రేషన్‌కార్డుల కోసం నిరీక్షిస్తున్నారు. సర్వే అనంతరం ఈప్రక్రియ ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఇప్పటికే కార్డులున్నవారి కుటుంబాల్లో కొంత మంది పేర్లు లేవు. దీంతో వారు తమ పేర్లు నమోదు చేయాలని కోరుతున్నారు. వీరితో పాటు కుటుంబంలో చిన్నపిల్లలు, పెళ్లయిన కొత్త కోడళ్ల పేర్లు నమోదుకు దరఖాస్తు చేసుకుని నిరీక్షిస్తున్నారు.
ఇప్పటికే 1,39,734 కార్డులు
జిల్లాలో 1,39,734 రేషన్ కార్డులున్నాయి. జిల్లాలో ని 335 గ్రామపంచాయతీలు, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల్లో 314 రేషన్ దుకాణాలు న్నాయి. వీటిలో 13,192 అంత్యోదయ, 1,26,542 ఫుడ్ సెక్యూరిటీ కార్డులున్నాయి. ప్రతీనెల 2,949.746 మెట్రిక్ టన్నుల బియ్యం లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. మార్చి నుంచి సన్నబియ్యం పంపిణీకి సన్నాహాలు చేస్తున్నారు.
17,044 దరఖాస్తులు
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల కోసం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో జిల్లాలో 1,63,647 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో కొత్త రే షన్ కార్డుల కోసం 17,044 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో దరఖాస్తుదారులు ఏడాది గా కార్డుల కోసం నిరీక్షిస్తున్నారు. ఈ నెల 16 నుంచి ప్రారంభమైన సర్వే 19 వరకు కొనసాగనుంది. ఈ నెల 20 నుంచి 24వరకు గ్రామసభల్లో అర్హుల జాబితా చదివి వినిపించి అభ్యంతరాలు స్వీకరి స్తారు. అనంతరం ఈ నెల 26న తుది జాబితా సిద్ధం చేస్తారు. తుది జాబితా ఆధారంగా కొత్త కార్డులు జారీ చేస్తారు.
ఇవే నిబంధనలు..
కొత్త రేషన్‌కార్డుల జారీకి ప్రభుత్వం మార్గదర్శకా లు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతంలో వార్షికాదా యం రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షల మించి ఉండకూడదు. 3.5 ఎకరాల మాగాణి, 7.5 ఎకరాల మెట్ట మించకుండా ఉండాలి. ప్రభు త్వ, ప్రైవేట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు, వైద్యులు, కాంట్రాక్టర్లు, నాలుగుచక్రాల వాహనదారులను అనర్హులుగా పరిగణిస్తారు. కుటుంబ సభ్యుల ఆధార్‌కార్డు నంబర్లతో మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
జిల్లాలో కొనసాగుతున్న సర్వే
లబ్ధిదారుల ఎంపికకు కసరత్తు
26 నుంచి కార్డుల జారీ షురూ
సర్వే ప్రక్రియ కొనసాగుతోంది
జిల్లాలో కొత్త రేషన్‌కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులపై సర్వే కొనసాగుతోంది. ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ నెల 26 నుంచి కొత్త కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అర్హులందరికీ ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేస్తుంది.
– వినోద్‌కుమార్,
జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment